యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖ రైల్వే జోన్ విభజన విషయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో మంగళవారం సాయంత్రం చేపట్టిన దీక్ష బుధవారం ఉదయం విరమించారు. నీతూ చౌదరి అనే విద్యార్థిని నిమ్మరసం ఇవ్వడంతో నిరసనకారులు దీక్ష విరమించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న 7 స్టేషన్లను ఖుర్ధా డివిజన్ నుంచి తప్పించి కొత్త విశాఖ జోన్ లో కలపాలనే డిమాండ్ తో అయన ఈ దీక్ష చేపట్టారు. పేరుకు విశాఖ రైల్వే జోన్ ప్రకటించినా జిల్లాలోని ఈ స్టేషన్లను కొత్త జోన్ లో కలుపుతారా, లేదా అనేది రైల్వేశాఖ స్పష్టత ఇవ్వలేదని అయన అన్నారు. దీని వల్ల ఈ ప్రాంతానికి ఎంతో నష్టం జరుగుతుందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాలను ఖుర్ధా డివిజన్ నుంచి తప్పించి కొత్త విశాఖ రైల్వే జోన్లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష లో స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్, పాతపట్నం శాసన సభ్యుడు కలమట వెంకటరమణ, నియోజకవర్గ నాయకులు, ప్రజా సంఘాలు సంగిభావం తెలిపారు. అనేక ఆదాయం ఇచ్చే స్టేషన్లను తీసుకువెళ్లి వాల్తేరు డివిజన్ లో కాకుండా వేరే డివిజన్ లో కలుపుతున్నారని అన్నారు. దీని వల్ల ఆదాయం భారీగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ పేరును కొత్త రైల్వే జోన్ పేరుతో మరుగున పడబోతొతుందని వీటన్నింటిని తిరిగి సాధించుకునే వరకు పోరాటం చేస్తానని అయన అన్నారు.