
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కడప జిల్లా నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పరారీ లో ఉన్న అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ గురుస్వామిని పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడిపై పై జిల్లాలో 40 కేసులు నమోదు అయ్యాయని వారన్నారు. గురుస్వామి అంతర్జాతీయ స్మగ్లర్ కందస్వామి పర్తిబాస్ కు వరుసకు బావమరిది అవుతాడు. గురుస్వామి తొ పాటు ఇతని ఇద్దరు అనుచరులను కుడా పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితులనుంచి 66 ఎర్రచందనం దుంగలు, ఒక లారి స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు.