Highlights
- మంత్రి హరీష్‌రావు హర్షం
- 2018 చివరి నాటికి రైతులకు నీరందిస్తాం
- రైతులకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. పిటిషన్‌ను దాఖలు చేసిన పిటిషనర్‌ను కోర్టు మందలించింది.ఈ సందర్భంగా కోర్టు స్పందించింది. చెన్నై బెంచ్ నుంచి ఢిల్లీకి ఎందుకు వచ్చారని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. ఫోరం హంటింగ్ చేస్తున్నారా అంటూ పిటిషనర్‌ను మందలించింది. కేసు దాఖలులోనే ఆలస్యం చేశారని కోర్టు పేర్కొంది. ఒక చోట కాకపోతే మరో చోటికి వస్తారా అంటూ చురకలంటించింది. కేసు విచారణకు అర్హం కాదంటూ, పిటిషనర్ ఆలోచన సరిగా లేదంటూ.. పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.వందకు పైగా కేసులు వేసినా రైతులు గెలిచారు.. న్యాయం, ధర్మం గెలిచిందన్నారు. ప్రాజెక్టులపై కేసులు వేయించింది ఏ కాంగ్రెస్ నేతో త్వరలో బయటపెడుతామని చెప్పారు. కాంగ్రెస్ నేతల కుట్రలను.. సాక్ష్యాధారాలతో శాసనసభ వేదికగా బయటపెడుతామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నో పిటిషన్లు వేశరన్నారు. కానీ ఆ పిటిషన్లను కోర్టులు కొట్టివేస్తున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల కుట్రలను.. సాక్ష్యాధారాలతో శాసనసభ వేదికగా బయటపెడుతామని చెప్పారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమంటే.. రాష్ట్ర ప్రగతిని, రైతుల అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజల కలలను నిజం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ తయారు కావడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కోదండరాం, కాంగ్రెస్ నేతలది రాజకీయ ఎజెండా అని పేర్కొన్నారు. కోదండరామైనా.. కాంగ్రెస్ నేతలైనా ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకునే వారు వారి మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని మండిపడ్డారు. చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు నీల్లు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది ఎవరో రైతులు, ప్రజలు గమనిస్తున్నారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ నేతలకు రైతులు, ప్రజలే సరియైన సమాధానం చెబుతారని చెప్పారు.