యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రయాగ్ రాజ్లో కుంభమేళా ముగిసింది. అక్కడ సుమారు మూడు నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా దిగ్విజయంగా నిర్వహించడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఆ కార్మికుల సేవలను గుర్తించిన ప్రధాని మోదీ.. సఫాయి కార్మికుల కార్పస్ ఫండ్ కు 21 లక్షలు విరాళం ప్రకటించారు. తన పర్సనల్ సేవింగ్ అకౌంట్ నుంచి ప్రధాని మోదీ ఆ మొత్తాన్ని కార్పస్ ఫండ్ కు డొనేట్ చేశారు. కుంభమేళాను అద్భుతంగా నిర్వహించిన యూపీ ప్రభుత్వాన్ని కూడా మోదీ మెచ్చుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మేళా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కుంభమేళాతో మన సంస్కృతిని, ఆధ్మాత్మికతను ఘనంగా చాటారు అని మోదీ ఓ ట్వీట్ కూడా చేశారు.మరోవైపు అజ్మీర్ లోని దర్గాలో ఉత్సవాలు జరుగుతున్నాయి. దర్గాలో 807వ ఉర్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ సమర్పించిన చాదర్ ను కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాకు తీసుకువెళ్లారు.