యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగుల గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళ్ళగా కోడం రంగన్న మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు తెలియజేశారు. కుటుంబ పరిస్థితులు, అప్పుల బాధ తాళలేక రంగన్న పురుగుల మందు తాగినట్టు గ్రామస్తులు తెలియజేశారు. మృతుడి వయస్సు 55 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు.