YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒంటరి ప్రయత్నాలు ప్రారంభించిన రాహుల్

ఒంటరి ప్రయత్నాలు ప్రారంభించిన రాహుల్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కలగానే మిగిలిపోనుంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలుతుందని విశ్లేషకుల అభిప్రాయం. రాహుల్ గాంధీ కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకున్న రాహుల్ గాంధీ ఉత్తరాదిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవాలన్న యోచనలో ఉన్నారు. ప్రాంతీయ పార్టీలతో కలసి వెళితే ఇక ఎప్పటికీ కాంగ్రెస్ కోలుకోలేదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకోసం ఈ ఎన్నికల్లో ఎంత లాస్ అయినా పరవాలేదు. కాంగ్రెస్ సొంతంగానే బరిలోకి దిగితే మేలని యువనేత రాహుల్ గట్టిగా కోరుకుంటున్నారు.అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ లో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు తమను పక్కన పెట్టినా పెద్దగా కంగారు పడలేదు. వారితో చర్చలకు ప్రయత్నించలేదు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు విషయం ప్రకటించిన వెంటనే తాము యూపీలో 80 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత తన సోదరి ప్రియాంక గాంధీని, సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియాను యూపీ ఎన్నికల బాధ్యులుగా నియమించారు. ప్రస్తుతం యూపీలో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ.ఇక తాజాగా ఢిల్లీ సయితం ఆమ్ ఆద్మీ పార్టీతో కలసి వెళ్లాలని తొలుత నిర్ణయించారు. ఆమ్ ఆద్మీ పార్టీకూడా కాంగ్రెస్ తో పొత్తుకు ఒక అడుగుకు ముందుకు వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సయితం అయితే ఢిల్లీ పరిధిలో ఉన్న ఏడు లోక్ సభ స్థానాల్లో ఆప్ కు నాలుగు స్థానాలు, కాంగ్రెస్ కు రెండు స్థానాలు, ఒక స్థానంలో ఇద్దరికీ అనుకూలమైన వారిని నియమించాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు అందుకు అంగీకరించకపోవడంతో ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. పంజాబ్ పై కూడా పడే అవకాశం ఉంది. గత లోక్ సభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకపోవడం, మరోవైపు అకాళీదళ్, భారతీయ జనతా పార్టీలు కలసి పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ కు చేదు అనుభవం ఎదురయ్యే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలను సొంతంగా సంపాదించుకోవాలన్న లక్ష్యంతోనే రాహుల్ గాంధీ ఉన్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసే దిశగానే రాహుల్ అడుగులు వేస్తన్నట్లు కన్పిస్తోంది.

Related Posts