YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సరిహద్దుల్లో పాక్ బలగాలు

సరిహద్దుల్లో పాక్ బలగాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇరుదేశాల సరిహద్దులో పాకిస్థాన్ అదనపు బలగాలను మోహరిస్తోంది. సైనికులతోపాటు ఆయుధాలను నియంత్రణ రేఖకు చేరువగా తరలిస్తోంది. అప్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని బలగాలను కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పలు సున్నిత ప్రాంతాలకు చేరవేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల మోత ఎక్కువైంది. సాధారణ పౌరులు లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతుండటంతో.. భారత ఆర్మీ పొరుగు దేశానికి ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. ఏదైనా దుస్సాహసానికి సిద్ధపడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత సైన్యం హెచ్చరించింది. నౌషరా సెక్టార్లోని పోస్టులను లక్ష్యంగా చేసుకుని 155 ఎంఎం ఆర్టిల్లరీ గన్స్‌తో పాకిస్థాన్ దాడులు చేసింది. బదులుగా భారత సైన్యం బోఫోర్స్ గన్స్‌తో ప్రతిదాడులు చేసింది. హాట్ లైన్ ద్వారా ఇరుదేశాల సైనికాధికారులు మంగళవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నియంత్రణ రేఖ వెంబడి జనావాసాలు లక్ష్యంగా కాల్పులు జరపొద్దని భారత్ సూచించింది. ఇదే విషయమై బుధవారం భారత్ మరోసారి పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది

Related Posts