యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కర్నూలు జిల్లా గ్రామ పంచాయతీలలో సఫాయి కర్మచారిగా తాత్కాలికంగా వృత్తి నిర్వహిస్తున్న వారికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం పవర్ ఆటోలను పంపిణి చేసారు. గురువారం కర్నూలు కలెక్టరెటు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా షెడ్యూలు కులాల పసేవా సహకార సంఘం, పంచాయతి రాజ్ శాఖ అధికారులు హజరయ్యారు. వీధులలో చెత్త తీసివేసే పనులకు గాను స్వచ్చ భారత్ మాషన్ క్రింద 704 పవర్ ఆటో లు రూ.14.52 కోట్ల విలువతో పంపిణీ చేస్తున్నారు.