YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

ఏపీలో 28 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

Highlights

  • మార్చి 19 వ తేదీ వరకు కొనసాగుతాయి
  • ఈ ఏడాది నుంచి గ్రేడ్ విధానం
  • పరీక్షా కేంద్రాల ఆచూకీకి  నూతన యాప్
  •  కాపీ కొడితే 8 పరీక్షల వరకు డిబార్
  • సమస్యలకు  టోల్ ఫ్రీ నెంబర్: 18002749868
 ఏపీలో 28 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు


ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు  ఇంటర్ బోర్డు కమిషనర్ బీ ఉదయలక్ష్మి చెప్పారు. అమ‌రావ‌తిలోని సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం  మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 10,26,891 మంది పరీక్షల‌కు హాజరవుతారన్నారు.

పరీక్షలు ప్ర‌తిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాల‌కి చేరుకోవాల‌ని అన్నారు. నేటి నుంచి హాల్ టికెట్లను jnanabhumi.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ను సంబంధింత కళాశాల ప్రిన్సిపాల్ తో ధ్రువీకరించాలని, దానిని తీసుకొని పరీక్షా కేంద్రానికి వెళ్లాలని వివరించారు.

ఫీజులు చెల్లించలేదన్న పేరుతో విద్యార్థుల హాల్ టికెట్లను ధ్రువీకరించని ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హత ఉన్న విద్యార్థులందరికీ హాల్ టికెట్లు ధ్రువీకరించాలని ఆమె చెప్పారు. విద్యార్థులు చదువుకునే కాలేజీ కాకుండా జంబ్లింగ్ విధానంలో మరో కాలేజీని పరీక్షా కేంద్రంగా నిర్ణయించినందున, వాళ్లు పరీక్షా కేంద్రాలను తెలుసుకోవడానికి ఇబ్బందిపడకుండా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్ లొకేటర్ అనే నూతన యాప్ ను రూపొందించినట్లు తెలిపారు.

యాండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే, అది కోడ్ నెంబర్ అడుగుతుందని, ఆ స్థానంలో విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పరీక్షా కేంద్రాన్ని చూపుతుందని వివరించారు. యాండ్రాయిడ్ సెల్ ఫోన్ లేనివారు ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. పరీక్ష రోజు ఉదయం కేంద్రాన్ని వెతుక్కోవడానికి ఎక్కవ సమయం కేటాయించకుండా, హడావుడి లేకుండా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలన్నారు.
కాపీ చేస్తూ పట్టుబడితే 8 పరీక్షల వరకు డిబార్‌..
మొత్తం 1423 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాటిలో 116 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. కాపీయింగ్ జరుగకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాపీ చేస్తూ పట్టుబడితే విద్యార్థిని 8 పరీక్షల వరకు డిబార్ చేస్తామన్నారు. విద్యార్థులు కాపీ చేసే అవకాశం లేకుండా, వారు డీబార్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద, అవకాశం ఉన్న మేరకు ప్రతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమని, సమస్యాత్మక కేంద్రాలలో తప్పనిసరిగా ప్రతి గదిలో ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
థియరీ పరీక్షలను కూడా పకడ్బంధీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి పది పరీక్షా కేంద్రాలకు ఒక ఫైయింగ్ స్క్వాడ్ ని, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రతి కేంద్రానికి ఒక సిటింగ్ స్క్వాడ్ ని నియమించినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చొని పరీక్ష రాసే పరిస్థితి లేకుండా, అందరికి కుర్చీలు గానీ, బెంచీలు గాని తప్పనిసరిగా ఏర్పాటు చేయమని లేకపోతే అద్దెకు తీసుకొని ఏర్పాటు చేయమని ఆదేశించినట్లు తెలిపారు.

Related Posts