యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009లో మార్చి 2న, 2014లో మార్చి 5న కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సారి (2019లో) ఇంతవరకు ఆ మేరకు ప్రకటన రాలేదు.. మరో పక్క షెడ్యూల్ విడుదలలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రభుత్వ ఖర్చులతో ఎన్నికల ప్రచారాలు చేస్తున్నారని, అవన్నీ పూర్తయ్యేంత వరకూ ఎన్నికల సంఘం వేచి చూస్తుందా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. జాప్యం చేసే కొద్దీ ఇలాంటి విమర్శలు పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల చేయొచ్చని చెబుతున్నారు.