Highlights
- ఇక బీఎస్సీకి కూడా ఎంసటే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ నిబంధనలను సవరించింది. శుక్రవారం ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ నిబంధనల సవరణతో ఇప్పటి నుంచి బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సుకు కూడా ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. దాంతో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించే ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చరల్, వెటర్నటీతో పాటు బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సును కూడా చేర్చి నిర్వహించనున్నారు.