యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జనవరి11 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పష్టంచేశారు. ద్వివేది మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఫారం-7అనేది దరఖాస్తు మాత్రమేనన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదని తెలిపారు. పోలీస్ కేసులు మొదలుకాగానే నకిలీ దరఖాస్తులు ఆగిపోయాయన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో పార్టీల వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదని హితవుపలికారు. ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలని సవాల్ విసిరారు. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందని వెల్లడించారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని వివరణ ఇచ్చారు.