YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఉగ్రవాదం విషయంలో పాక్‌ తీరును బట్టబయలు చేసిన ముషారఫ్‌

 ఉగ్రవాదం విషయంలో పాక్‌ తీరును బట్టబయలు చేసిన ముషారఫ్‌

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఉగ్రవాదులకు పాక్‌ స్వర్గధామంగా మారిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నప్పటికీ.. పాక్‌ మాత్రం అటువంటిదేమీ లేదని బుకాయిస్తోంది. అయితే తాజాగా ఉగ్రవాదం విషయంలో పాక్‌ తీరును ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ బట్టబయలు చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అని.. భారత్‌ లో దాడులు జరిపేందుకు పాక్‌ నిఘా వర్గాలు జైషేను ఉపయోగించుకుంటున్నాయని ముషారఫ్‌ వెల్లడించారు.ఓ పాకిస్థానీ జర్నలిస్టుకు టెలిఫోన్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2003లో జైషే సంస్థ తనను రెండు సార్లు చంపడానికి యత్నించిందని అన్నారు. జైషేపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన స్వాగతించారు. అయితే మీరు అధికారంలో ఉన్న సమయంలో జైషేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా.. నాటి పరిస్థితులు భిన్నమైనవి అని, ఆ విషయంలో తాను కూడా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని అంగీకరించారు.పాక్‌ నుంచి జైషే భారత్‌లో పలు దాడులకు పథకాలు రచించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడి కూడా జైషేనే చేసింది.

Related Posts