YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రఫేల్‌ గుట్టు విప్పితే కేసు పెడతారా? కేంద్రం ఫై నిప్పులు చిరిగిన చంద్రబాబు

రఫేల్‌ గుట్టు విప్పితే కేసు పెడతారా?         కేంద్రం ఫై నిప్పులు చిరిగిన చంద్రబాబు

కేంద్రం నమ్మించి మోసం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక హామీ ఇచ్చాక మాట్లాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. హామీలు నెరవేరకపోవడంతో 5 కోట్ల మంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. విభజన జరిగినప్పుడు రెండువైపులా సమన్యాయం చేయాలి. హామీలను నెరవేర్చకపోగా మనల్ని అణగదొక్కే యత్నం చేస్తున్నారు. ఐటీ, సీబీఐ వంటి సంస్థలతో మనపై దాడులు చేయిస్తున్నారు. హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయాం. అప్పులు నెత్తిన పెట్టుకొని ఇక్కడకు వచ్చాం. హుదూద్‌‌, పెతాయ్‌ వంటి తుపాన్ల నుంచి నిలదొక్కుకొని ఉన్నాం. నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్పం, జన్మభూమి ద్వారా స్ఫూర్తి తీసుకొచ్చాం. వ్యవసాయంలో 10.92 శాతం వృద్ధిని సాధించాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నాం. అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉన్నాం. రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం ఏపీనే. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తాం’’ అన్నారు.‘రాజకీయ నాయకులు బాధ్యతతో పనిచేయాలి. రాష్ట్రంలో వైకాపా అభివృద్ధికి అడ్డంపడుతోంది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రఫేల్‌ కుంభకోణం గుట్టు విప్పిన రామ్‌పై కేసు పెడతారు. ఇటు మేం 20 ఏళ్ల నుంచి కార్యకర్తల డేటాను కంప్యూటరైజ్‌ చేస్తే ఆ సమాచారం దొంగిలించి మా ప్రభుత్వంపైనే కేసు పెడతారా..? మరో పక్క ఫారం-7 పెట్టి ఓట్లను తొలగిస్తారా..? తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అనుసరిస్తారా..? కార్యకర్తలు డేటా సేకరిస్తే తప్పు ఏంటి? ఒక ప్రైవేటు కంపెనీ డేటాను ఏ చట్ట ప్రకారం తీసుకుంటారు? ఓట్లను చెక్‌ చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జగన్‌కు హైదరాబాద్‌లో ప్రభుత్వం సహకరిస్తోంది. అక్కడి ఆర్థిక మూలాలను ఉపయోగించుకొని కేసులు పెడతున్నారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్థిక ఉగ్రవాదుల్లా పనిచేస్తున్నారు. ఇటువంటి దాడులపై పోరాడుతాం’’ అని చంద్రబాబు నాయుడు తెలిపారు.

Related Posts