YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాత ఎన్నికల వ్యూహంతోనే బాబు

 పాత ఎన్నికల వ్యూహంతోనే బాబు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సేమ్ సీన్ రిపీట్ అవుతుంది… అవే కామెంట్స్.. మళ్లీ వినపడుతున్నాయి. 2014లో జరిగినట్లుగానే అచ్చుగుద్దినట్లుగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వ్యూహాన్ని అమలులోకి పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అరాచకం రాజ్యమేలుతుందని టీడీపీ మరోసారి తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే ఈ ప్రచారం చేసే బాధ్యతను భుజానకెత్తుకున్నారు. ఓట్లు గల్లంతు చేసిన వాళ్లు… మీ ఇళ్లల్లో అమ్మాయిలను ఎత్తుకుపోయినా అడిగే వారుండరని ఆయన విన్నూత్న తరహాలో జగన్ పై దాడిని ప్రారంభించారు. వైఎస్ జగన్ అవినీతిపరుడని, లక్షల కోట్ల రూపాయలు దోచుకుతిన్నారని గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. సీబీఐ కేసుల్లో కూరుకుపోయి ఉన్న జగన్ కు ఓటేస్తే రాష్ట్రాభివృద్ధి జరగదని పదే పదే చెప్పి ప్రజల మైండ్ లోకి ఎక్కించి సక్సెస్ అయ్యారు చంద్రబాబు.లక్షల కోట్ల అవినీతి ఇప్పుడు పాత పడి పోయింది. సీబీఐ కేసుల ఊసెత్తినా ఇప్పుడు ప్రయోజనం లేదని గ్రహించిన చంద్రబాబు తాజాగా డేటా చోరీ కేసును తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో పడ్డారనిపిస్తోంది. జగన్ ఒక ఆర్థిక నేరగాడని, హత్య చేసేటప్పుడు నేరగాళ్లు ఎలిబీ సృష్టించినట్లుగానే, జగన్ ఓట్ల తొలగించే ముందు ఎన్నికల కమిషన్ ను కలసి వచ్చారని చెబుతున్నారు.హైదరాబాద్ లో ఆస్తులున్న ఆంధ్రులపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరిస్తున్నారన్నారు. తమ పార్టీకి సహకారం అందిస్తున్న ఒక ప్రయివేటు సంస్థ పై తెలంగాణ పోలీసులు దాడిచేసి తమ పార్టీ డేటాను చోరీ చేసి జగన్ కు అందించారన్నారు. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందంటున్న చంద్రబాబు జగన్ కు ఓట్ల తొలగింపులో సహకరించిన వారందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు కూడా. ఏపీ ప్రజలపై జగన్ కేసీఆర్, మోదీలతో కలిసి దాడి చేయిస్తున్నారని క్షేత్రస్థాయిలో ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించారు.జగన్ పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధినిలిచిపోతుందని, కేసీఆర్ చెప్పినట్లుగానే జగన్ నడుచుకుంటాడన్న ప్రచారాన్ని కూడా చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఏపీ ప్రజలపై పొరుగు రాష్ట్ర సెంటిమెంట్ ను ప్రయోగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే అధికారంలోకి రాకమునుపే జగన్ ఇన్ని అరాచకాలకు పాల్పడుతుంటే, అధికారం వస్తే రాష్ట్రం ఏమై పోతుందని చంద్రబాబు పదే పదే ప్రశ్నిండం వెనక కూడా జగన్ నేరమనస్తత్వం కలవాడని ప్రజల్లో ప్రచారం చేయాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. మొత్తం మీద గత ఎన్నికల వ్యూహాన్నే మళ్లీ ఈ ఎన్నికల్లో అమలు పర్చాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా ఉంది.

Related Posts