యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కరువు సెగ మనుషులకే కాదు.. మూగజీవాలకూ తగులుతోంది. పశువులకు పశుగ్రాసం కరువై రైతులు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. వాటిని కసాయిలు కబేళాలకు తరలిస్తున్నారు. పశువులను రైతుల కళ్లఎదుటే కాళ్లు విరగగొట్టి వాహనాల్లో తరలిస్తుంటే ఆ మూగజీవాల వేదన వర్ణణాతీతం. ఐదారేళ్లుగా కరువు కాటుకు రోజురోజూ పశు సంపద తరిగిపోతోంది. నేరుగా పల్లెల నుంచి వాహనాలలో బెంగళూరు, ముంబై, పూణె తదితర ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. మరికొందరు రైతులు గోరంట్ల పశువుల సంతకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అక్కడి నుంచి వ్యాపారులు నగరాలకు లారీల ద్వారా తరలిస్తుంటారు. గొర్రెలు, మేకలకు గ్రాసం కరువు అవడంతో వాటిని బతికించుకోవటానికి పక్కరాష్ట్రాలకు గొర్రెలమందలతో వలస వెళుతున్నారు. ఒకప్పుుడు గ్రామాల్లో ప్రతి ఇంటిలో ఎనుములు, ఎద్దులు, మేకలతో సందడిగా ఉండేది. ఏఇంటిలోనూ ఆ సందడి కానరాదు. కరువు సెగ మనుషులకే కాదు.. మూగజీవాలకూ తగులుతోంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పశువులను పశుగ్రాసం కరువై రైతులు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. వాటిని కసాయిలు కబేళాలకు కబేళాలకు తరలిస్తున్నారు. పశువులను రైతుల కళ్లఎదుటే కాళ్లు విరగగొట్టి వాహనాల్లో తరలిస్తుంటే ఆ మూగజీవాల వేదన వర్ణణాతీతం. గత ఐదారేళ్లుగా కరువు కాటుకు రోజురోజూ పశు సంపద తరిగిపోతోంది. నేరుగా పల్లెల నుంచి వాహనాలలో బెంగళూరు, ముంబై, పూణె తదితర ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. మరికొందరు రైతులు గోరంట్ల పశువుల సంతకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అక్కడి నుంచి వ్యాపారులు నగరాలకు లారీల ద్వారా తరలిస్తుంటారు. గొర్రెలు, మేకలకు గ్రాసం కరువు అవడంతో వాటిని బతికించుకోవటానికి పక్కరాష్ట్రాలకు గొర్రెలమందలతో వలస వెళుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అధికారిక లెక్కల ప్రకారం 73520 పశువులు, ఎనుములు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో కనీసం 20 వేల వరకు కబేళాలకు తరలివెళ్లిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు పశువులు అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. గత ఏడాది వర్షాలు కురవకపోవడంతో వేరుశెనగ పంట పూర్తీగా ఎండిపోయి పశుగ్రాసం కూడా చేతికి రాలేదు. బోరు బావుల కింద అక్కడక్కడా రబీ సీజన్‌లో పండిన వేరుశెనగ కట్టె టైరుబండి రూ.10 వేల ధర పలుకుతుండగా, వరి పైరు, మొక్కజొన్న దంట్లు సైతం రూ.6 వేలు పలుకుతోంది. అంత ధర పెట్టలేక రైతులు పశుసంపదను అయినకాడికి తెగనమ్ముకోవడం మొదలు పెట్టారు. ఇక చిన్న జీవాల పరిస్థితి చెప్పనవసరం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా గొర్రెలు 7.73 లక్షలు, మేకలు 1.57 లక్షలుండగా వీటికి నీటి కొరతతో పాటు గ్రాసం కొరత పట్టిపీడిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రాసం, నీరు కరువు ఏర్పడడంతో కర్నాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మేత కోసం పెంపకం దారులు తీసుకెళ్తున్నారు. కొందరు వలసలు తీసుకెళ్లలేక ఇక్కడే మాంసం విక్రయదారులకు అమ్మే స్తున్నారు. మనుషులు దాహార్తి తీర్చుకోవడానికే నానా తంటాలు పడుతుంటే ఇక మూగజీవాల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతంలోని ప్రభుత్వాలు పలుచోట్ల పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు మూడు నెలల పాటు తాగునీటిని కూడా ఏర్పాటు చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ఆయోచనే లేదు. కనీసం మూడు నెలల పాటు పశుగ్రాస కేంద్రాలను, నీటి కేంద్రాలను ఏర్పాటు చేసి మూగ జీవాలను కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు. అయితే ఈ విషయమై పశు సంవర్ధక శాఖ అధికారులు వివరణ ఇస్తూ అలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అవసరమైన దాణ సబ్సిడీపై అందిస్తున్నామని చెబుతున్నారు.