Highlights
- చెంప దెబ్బలకు జాలిడేశారు
- జస్టిస్ లోయా కేసులో చోర చూపండి
- సీఎం కేజ్రీవాల్ ఆక్రోశం
- లెఫ్టినెంట్ గవర్నర్ కలవనున్న మంత్రి మండలి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై దాడి ఘటనలో కీలక ఆధారాల సేకరణ కోసం శుక్రవారం ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక పక్క పోలీసులు తన ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగానే ..మరో పక్క కేజ్రీవాల్.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.. దివంగత సీబీఐ జడ్జి జస్టిస్ బీహెచ్ లోయా కేసు విచారణలోనూ దర్యాప్తు సంస్థలు అంతే చొరవ చూపాలని ఆయన అన్నారు. ట్విట్టర్‌లో ఆయన తన అసహనాన్ని వెళ్లగక్కారు. ‘‘నా ఇంటికి భారీగా పోలీసులను పంపారు. రెండు చెంప దెబ్బలకు సీఎం ఇంటిని మొత్తం జల్లెడ పట్టించారు. మరి, జస్టిస్ లోయా మరణంపై అమిత్ షాను ఎప్పుడు విచారిస్తారు’’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాకుండా చెంప దెబ్బలకు సంబంధించి తమ వాదనను వినిపించేందుకు మంత్రి మండలి.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అపాయింట్‌మెంట్‌ను తీసుకున్నట్టు వెల్లడించారు.