YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కమల్ పార్టీలో కొవై సరళ

కమల్ పార్టీలో కొవై సరళ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రముఖ హాస్యనటి కోవై సరళ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శుక్రవారం కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యంలో చేరారు. కమల్ కోవై సరళను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కమల్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు సరళ. ఎంఎన్ఎం పార్టీ కోసం కమల్ సూచనల మేరకు పని చేసేందుకు సిద్ధమన్నారు. సరళ సేవలు పార్టీకి చాలా అవసరమన్నారు కమల్ హాసన్. పార్టీ బలోపేతానికి ఆమె సహకారం తీసుకుంటామన్నారు. మరోవైపు కోవై సరళ చేరిక తమకు కలిసొస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుందంటున్నారు. అంతేకాదు హాస్య నటిగా గుర్తింపు పొందిన కోవై సరళ మంచి వక్త కూడా.. ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగంతో ఆకట్టుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కమల్హాసన్, కోవై సరళ కాంబినేషన్లో వచ్చిన సతీలీలావతి సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత కమల్ కాంభినేషన్లో చాలా సినిమాల్లో కోవై సరళ నటించారు. మరి సినిమా కెరీర్లో సక్సెస్ సాధించిన సరళ.. పొలిటికల్ కెరీర్లో ఎలా రాణిస్తారో చూడాలి.

Related Posts