YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

సౌత్ లో మార్చి 2 నుంచి సినిమాలు బంద్ 

Highlights

  • ధరల తగ్గింపుపై చర్చలు విఫలం
  • వీపీఎఫ్ తగ్గింపుకు ససేమిరా అన్న డీఎస్‌పీలు
  • డైలమాలో కొత్త సినిమాలు 
సౌత్ లో మార్చి 2 నుంచి సినిమాలు బంద్ 

దక్షిణాదిలో మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన నిలిపివేసేందుకు నిర్మాతలు, పంపిణీదారులు నిర్ణయించారు.ధరలు తగ్గించాలని నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయించారు. శుక్రవారం బెంగళూరులోని ఫిలిం ఛాంబర్‌లో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డీఎస్‌పీలు) క్యూబ్, యూఎఫ్‌ఓ సంస్థల ప్రతినిధులతో  దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ నిర్మాతల ఐకాస నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలనే ఆలోచనకు వచ్చారు. ఇదే గనుక జరిగితే ఇప్పటికే రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్‌ సినిమాలు విడుదల కాని పరిస్థితి నెలకొంది. వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్) విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. 
దక్షిణాది సినిమా థియేటర్లలో ఓ ప్రాంతీయ సినిమా ప్రదర్శనకు ఒక్కో స్క్రీన్‌కు సుమారు రూ.22500 వరకు వీపీఎఫ్‌ను డీఎస్‌పీలు వసూలు చేస్తున్నాయి. ఇది నిర్మాతలకు భారంగా మారుతోంది. అందువల్ల ఈ రేటును సగానికి తగ్గించాలనేది నిర్మాతల మండలి ప్రధాన డిమాండ్. కానీ వారి డిమాండ్‌కు డీఎస్‌పీలు తలొగ్గకపోవడంతో మార్చి 2 నుంచి దక్షిణాది సినిమాల ప్రదర్శన నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.

Related Posts