Highlights
- ఫైర్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్ రద్దు
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ వజ్రాల సంస్థ ఫైర్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఝలక్ ఇచ్చారు. ఈ స్కామ్ కారణంగా ఆ కంపెనీతో తన కాంట్రాక్టును వదులుకున్నారు. ఈ విషయాన్ని హీరోయిన్ తరపున ఆమె ప్రతినిధి తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించి నీరవ్ మోదీ సంస్థ సుమారు 1200 కోట్లు ఎగ్గొట్టన కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే .అయితే ఆ కంపెనీ ఆభరణాలకు ప్రియాంకా గతంలో ప్రమోషన్ చేసింది. ఇదిలా ఉండగా తనకు రావాల్సిన అమౌంట్‌ను కూడా నీరవ్ ఇవ్వలేదని ఇటీవల ప్రియాంకా పేర్కొన్న విషయం విదితమే.