YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కుట్రల కూటమి

కుట్రల కూటమి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  

ఈ రోజుతో 25 ఎంపీ సీట్ల పరిధిలో సమీక్ష పూర్తి అయింది. అభ్యర్ధులపై రాబోయే రెండు  రోజులు విశ్లేషిస్తాం. ఆ వెంటనే ప్రజల్లోకి ప్రచారం, బహిరంగ సభలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం అయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ మొదటివారంలో రైతులకు మరో రూ.4వేల కోట్లు ఇస్తాం. అన్నదాత సుఖీభవ రుణమాఫీతో రైతుల్లో భరోసా ఏర్పడింది. సాధికార మిత్రలపై బిజెపి ఫిర్యాదు అక్కసుతోనే అని అయన విమర్శించారు. రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా పనిచేసే మహిళలపై బిజెపి కక్షా..? రాష్ట్రాన్ని, దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడమే మోది నిర్వాకం. పుల్వామా పనిచేయలేదు, అందుకే మళ్లీ అయోధ్య తెరపైకి తెచ్చారు. బిజెపి, టిఆర్ ఎస్, వైసిపి కుట్రల కూటమిగా మారాయి. టిడిపి ప్రభుత్వం వల్లే భూముల ధరలు పెరిగాయి. వైసిపి, టిఆర్ ఎస్ కుట్రలతో భూముల ధరలు పతనం అయ్యాయి. రాజధానిలో, జిల్లాలలో రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. మరో 2రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అంటున్నారు. ఇప్పుడు కూడా జగన్ హైదరాబాద్ లోనే మకాం వేసారు.  కుట్రల కేంద్రంగా హైదరాబాద్ కు అప్రదిష్ట తెచ్చారు. విద్యుత్ బకాయిలు ఏపీకి ఇవ్వాల్సిందేమీ లేదంటారు..
ఏపికి రూ.11,278కోట్లు తెలంగాణ ఇవ్వాలి. కానీ ఏపియే రూ.2,046కోట్లు ఎదురు కట్టాలంటారు. పరిష్కరించాల్సిన బిజెపి నేతలు చోద్యం చూస్తారు. నీళ్లు సముద్రంలో కలిసినా టిఆర్ ఎస్ కు ఇష్టమే.  వృధాగా పోయే నీళ్లు వాడుకున్నా కెసిఆర్ కు కన్నెర్ర. వాళ్లు కాళేశ్వరం కట్టుకోవచ్చు, మనం ఏపిలో కట్టకూడదా అని ప్రశ్నించారు. మన ‘గోదావరి-పెన్నా అనుసంధానానికి’ టిఆర్ ఎస్ అడ్డంకులు వేస్తోంది.  ఏపి నదుల అనుసంధానంపై దేశం మొత్తం ప్రశంసించింది.  కానీ కెసిఆర్, జగన్మోహన్ రెడ్డికి మాత్రం కన్నెర్ర చేస్తున్నారు. ఆంధ్రావాళ్లు ఊడిగం చేయాలనేది కెసిఆర్ ఆలోచన. ఏపి నీళ్లకు మోకాలడ్డే కెసిఆర్ తో జగన్ దోస్తీ.  సొంత ప్రాంతానికి నీళ్లిచ్చినా జగన్ కు కంటిమంటే. జగన్ కు ఓటేస్తే కెసిఆర్ కు, మోదికి ఓటేసినట్లే. అందిన ఫారమ్ 7 లలో 95% బోగస్ అని అధికారే చెప్పారు. ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలి. మా ఓట్లు తొలగించి మమ్మల్నే ఓటడుగుతారా ..?  వైఎస్సార్ కాంగ్రెస్ ను ప్రజలంతా నిలదీయాలి. మమ్మల్ని బతికుండగానే చంపేస్తారా’ అని ప్రశ్నించాలి. రేపు బూత్ ల వద్ద ఓటర్లే వైసిపిని నిలదీయాలని చంద్రబాబు సూచించారు.

Related Posts