Highlights
- సౌతాఫ్రికాతో రసవత్తర పోటీ
- చివరి మూడో టీ20
అరుదైన రికార్డును సొంతం చేసుకునేందుకు సౌతాఫ్రి కాతో నేడు టీమిండియా చివరి, మూడో టీ20 ఆడనుంది. గత మ్యాచ్‌లో దెబ్బతిన్న కోహ్లీ సేన కోలుకుని ఎనిమిది వారాల సుదీర్ఘ పర్యటనను గెలుపుతో ముగించాలని భావిస్తోంది. జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టీ20లో మెన్ ఇన్ బ్లూ 28 పరుగులతో గెలిచారు. కానీ సెంచూరియన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా పుంజుకుని 6 వికెట్లతో టీమిండియాను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. సెంచూరియన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ ప్లాన్‌ను మార్చింది. తర్వాత భారత బౌలర్లపై సౌతాఫ్రికా జట్టు విరుచుకు పడింది. మార్పులేని జట్టుతో గత మ్యాచ్‌లో డుమిని బరిలోకి దిగాడు. మరి ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ రాణించేందుకు ఆదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది.
ఈ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఒకట్రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ మూడు గంటల వ్యవధి గల ఈ మ్యాచ్‌లో బుమ్రాను ఆడించే సాహసం చేస్తుందో లేదో చూడాలి. నిజం చెప్పాలంటే శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌కు రెండు వారాల విశ్రాంతి లభిస్తుంది కాబట్టి చివరి టీ20లో బుమ్రాను ఆడించే అవకాశముంది. బౌలింగ్ కాంబినేషన్‌పై కూడా టీమిండియా మేనేజ్ మెంట్ దృష్టి పెట్టింది.