యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం లంక గ్రామాలైన ఎదురుమొండి నాచుగుంట మధ్య ఉన్న ఏడు కిలోమీటర్ల రోడ్డు లో 4.5 కిలోమీటర్ల రోడ్డు వరకు తారు రోడ్డు వేయడం జరిగింది. మిగిలిన భాగమును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉందని తెలియడం వలన పనులను ఆపివేయడం జరిగింది. ఈ మూడు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంటలు పడి పోయి ప్రయాణం చేయటానికి వీలు లేకుండా నాచుగుంట ఈల చెట్ల దిబ్బ గ్రామస్తులకు చాలా ఇబ్బంది కలుగుతోంది. కనీసం గుంటలు పూడిస్తే రాబోయే వర్షాకాలంలో ఈ చిన్న ముక్క మరింత గుంటలు పడి పోకుండా కాస్తంత ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలుగజేస్తుంది..