YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫిర్యాదు లేకుండానే పోలీసుల దాడులు

ఫిర్యాదు లేకుండానే పోలీసుల దాడులు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  

డేటా చౌర్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం జగన్ డైరెక్షన్ లో పని చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అరోపించారు. జగన్ డైరెక్షన్ అంతా ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన వినతి పత్రం, ఫిర్యాదు లేఖతో పాటు ఇచ్చేశారనీ అయన అన్నారు.  దొంగ ఎంత జాగ్రత్తగా దొంగతనం చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాడని, అందుకు జగన్ వ్యవహారం నిదర్శనమని చంద్రబాబు అన్నారు. జగన్ అండ్ కో అంటే ముగ్గురు మోడీలు ఒక తప్పు చేసి దానిని కప్పిపుచ్చుకోవడానికి తప్పుమీద తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.  ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకుట్ర రచించారు. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేశారు. సాక్ష్యాలతో సహా దేశం ముందు బైటపెడుతున్నాను. రాష్ట్ర ప్రజలు,దేశ ప్రజలు దీనిపై ఆలోచించాలి. దుష్ట చతుష్టయం కుట్రలు దేశం తెలుసుకోవాలి. నరేంద్రమోది, అమిత్ షా, కెసిఆర్, జగన్ బరితెగించారని మండిపడ్డారు. ప్రజలు అసహ్యించుకుంటారు అనేది వదిలేశారు. ప్రజలు ఛీ కొడతారు అనే భయం లేకుండా చేశారు. ఒక మహా కుట్రకు ఏవిధంగా నాంది పలుకుతారో ఇదే రుజువు. చాలా నీచాతినీచంగా వ్యవహరించారు
విజయసాయి రెడ్డి ఫిబ్రవరి మొదటివారం లో ప్రధాన ఎన్నికల అధికారికి ఒక వినతి రాశారు.   తరువాత ఐటి గ్రిడ్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ కంపెనీపైన తెలంగాణపోలీసులతో చట్టవిరుద్దంగా దాడి చేయించారు. టిడిపి సేవామిత్ర యాప్ సమాచారం, సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం అంతా చోరీ చేశారు. రాత్రికి రాత్రి అశోక్ ఆఫీస్ పై దాడి చేయడం, నలుగురు ఉద్యోగులను బెదిరించడం,వాళ్ల కుటుంబ సభ్యులను వేధించడం అన్నీచేశారు. విజయసాయి రెడ్డి ఫిబ్రవరి 22నే ఢిల్లీలో ఇచ్చారు, 23న హైదరాబాద్ లో దిగారు, ఆ రోజే అశోక్ కంపెనీ పై దాడి చేశారు.
26 న  టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీనిపై వచ్చింది. ‘‘డేటా బ్రీచ్ బై టిడిపి యాప్..? యుఐడిఏఐ(ఉడాయ్), ఈసి లాంచ్ ప్రోబ్’’ శీర్షికతో వచ్చింది. అందులో ఫిర్యాది విజయసాయి రెడ్డి అని స్పష్టంగా రాశారు. తాను ఫిర్యాదు చేశానని విజయసాయి ఎందుకని చెప్పలేదని అయన ప్రశ్నించారు.  తెల్లకాగితాలపై విఆర్ వోల సంతకాలు తీసుకోవడం ఏంటని..? అంటూ కేసు అథెంటిసిటిపైనే అనుమానాలు ఉన్నాయని హైకోర్ట్ ఆర్డర్ లో పేర్కొంది. కేస్ డైరీ చూస్తే, ఇన్వెస్టిగేషన్ పైనే అనుమానాలు ఉన్నాయని హైకోర్ట్ ఆర్డర్ లో పేర్కొంది. మార్చి 3 సాయంత్రం 7గంటల కల్లా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇంకో ఫి ర్యాదు. దశరథరామి రెడ్డి అనేవాడితో మరో కంప్లయింట్ రిజిస్టర్ చేస్తారు. ఏడవ తేదిన  సిట్ ఛీఫ్ స్టీఫెన్ రవీంద్ర  ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు 23 వతేది దాడి, సోదా నిజమేనని ఒప్పుకున్నారు. హైకోర్ట్ తప్పు పట్టింది అనేది సైబరాబాద్ కమిషనర్ ప్రెస్ మీట్ లో చెప్పారు  ఫిబ్రవరి 23 ముందే విచారణ చేశామని సిట్ ఛీఫ్ (స్టీఫెన్ రవీంద్ర) ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ విచారణ గురించి సైబరాబాద్ కమిషనర్ ఎందుకు చెప్పలేదని అయన అన్నారు. ఫిబ్రవరి 22 దాడి,సోదాల ఫొటోలు టిడిపి నేతలు విడుదల చేశారు. ఆ తరువాతే సిట్ ఛీఫ్ విచారణ నిజమే అని ఒప్పుకున్నారు. ఎవరి ఫిర్యాదుతో ఫిబ్రవరి 22న విచారణ పేరుతో ఐటి గ్రిడ్ కంపెనీపై దాడి చేశారు..? ఎవరి ఫిర్యాదుతో కంపెనీలో డేటా తీసుకుపోయారు.? అక్కడి ఉద్యోగులను బెదిరించారు..? ఆ ఫిర్యాదుదారు విజయసాయి రెడ్డేనా..?
ఫిబ్రవరి 23, మార్చి 2,3,4 తేదీలలో విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నారు..? ఆ 4 రోజులు హైదరాబాద్ లో మకాం వేశారా, లేదా అని ప్రశ్నలు కురిపించారు. ఫిబ్రవరి 19న విజయసాయి రెడ్డి ఇచ్చిన వినతిలోనే కుట్రకు స్కెచ్ ఉంది. కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రాశారు. వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసికి అందించారు. రాసుకున్న స్కెచ్ కూడా ఈసికి వినతిలో జత చేశారు. అక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బైటపడింది. ఈ కుట్ర ‘బాహుబలి’ కుట్రలను మించిపోయింది. ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా రాశారా లేదా అని అడిగారు. వ్యూహంలో భాగంగా హైదరాబాద్ లో ఎలాంటి ఫిర్యాదులు అందకుండానే ఐటీ గ్రిడ్స్ పై దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాతే కేసు నమోదుచేశారని వ్యాఖ్యానించారు.  

Related Posts