Highlights
- నగరంలో బయోకాన్ పరిశోధన కేంద్రం
- కిరణ్ మజుందార్ షాతో కేటీఆర్ భేటీ..
- టాస్క్‌తో జట్టుకు జీఈ సిద్ధం
- జీఈ, మెర్క్‌లైఫ్, డెలాయిట్.. ప్రతినిధులతో సమావేశం
- బయో ఏషియా సదస్సులో కేటీఆర్
లెఫ్ సైన్సెస్‌లో ప్రజలకు ఉపయోగపడే కొత్త కొత్త ఆవిష్కరణలు జరగాలని, తక్కువ ధరల్లో వారికి అందుబాటులోకి రావాలని తెలంగాణా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో భాగంగా రెండో రోజు మంత్రి కేటీఆర్ పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు.నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెలాయిట్, జీఈ కంపెనీల సీఈవోలు, సీనియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాటు థాయ్ ల్యాండ్ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు.
దేశంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నామని, జీనోమ్ వ్యాలీని మరింత విస్తారిస్తామని చెప్పారు. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటిక్ రంగాల్లో పరిశోధనలు పెరుగుతాయన్నారు. నగరంలో నెలకొల్పే ఫార్మా కంపెనీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. సదస్సు రెండో రోజు ‘‘ద ప్రిస్కిప్షన్ ఫర్ ప్రోగ్రెస్- ఇండియన్ లైఫ్ సైన్సెస్ గ్రోత్’’ అనే అంశంపై జరగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం బడ్జెట్‌లో భారత ప్రభుత్వం 0.83 శాతాన్ని కేటాయిస్తుందని, రిస్క్‌తో కూడుకున్న వాటిలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపదన్నారు. భారత్ వంటి ఎదుగుతున్న దేశానికి కొత్త ఆవిష్కరణలు జరిగితే భారతీయ ప్రజలకు, దేశానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతేకాదు కొత్తతరానికి అవకాశాలు ఇవ్వాలని, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలతో జతకట్టి పరిశోధనలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత పురోగతి సాధించేందుకు అయారంగాల్లోని నిపుణులు, పరిశ్రామిక వేత్తులు, ప్రభుత్వాధికారులతో కూడిన ఒక కమీటీని ఏర్పాటు చేయాలని కిరణ్ మజుందార్ సూచించారు. కాగా, జీఈ (సస్టెయినబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్) ప్రెసిడెండ్, సియివో టెర్రీ బ్రెసెన్హమ్ తో మంత్రి సమావేశం అయ్యారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టివర్క్స్ లో జీఈ భాగస్వాములవుతున్నదని ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న ఇంక్యూబేటర్ లో జీఈ భాగస్వాములవ్వాలని కోరారు.
బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ సంస్థ ‘బయోటెక్ నగరంలో’ తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖుత వ్యక్తం చేసింది. బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాతో సమావేశం అయ్యారు. జినోమ్ వ్యాలీలో బయోకాన్ నూతన పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ) సెంటర్ ను ఎర్పాటు చేస్తున్నట్లు అమె మంత్రికి తెలిపారు. తమ అనుబంద కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 1000 హైస్కిల్డ్ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతోపాటు బయోకాన్లోని సిబ్బందిని రెట్టింపు చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందిస్తామని అమె మంత్రికి తెలిపారు. బయోకాన్ నూతన యూనిట్ ఏర్పాటును స్వాగతించిన మంత్రి కేటీఆర్ కిరణ్ మజుందార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తరపున టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో మంత్రి చేస్తున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు.ఫార్మసిటీ ఎర్పాటు గురించి మంత్రి వివరించారు. భవిష్యత్తు విస్తరణకు ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ స్టార్టప్ ఈకో సిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి రానున్న కిరణ్ మజుందార్ హైదరాబాద్ పర్యటనలో నగరంలోని 20 టాప్ స్టార్టప్స్తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ టాస్క్‌తో కలిసి హెల్త్ కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్దంగా ఉన్నదని టెర్రీ వెల్లడించారు. అనంతరం థాయ్ లాండ్ ఉప వాణిజ్య శాఖ మంత్రి చుటిమా బున్యాప్రఫసారా, భారతదేశంలో ఇటాలియన్ కాన్సుల్ జెనరల్ ఇన్ ముంబాయి స్టేఫానియా కస్టాన్జా తో మంత్రి సమావేశం అయ్యారు. భాద్యతలు చేపట్టిన తర్వతా హైదరాబాద్ నగరంలో తొలిసారి పర్యటిస్తున్న తనకు ఇక్కడి టెక్స్ టైల్ రంగం, ఫార్మా, సినిమా పరిశ్రమ అనుబంధ రంగాలలో పెట్టుబడులు అవకాశాలపైన అలోచిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బయోటెక్ రంగంలో ఇటలీ దేశ ఇకో సిస్టమ్ తో ఇక్కడ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలపై అనేక కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. మెర్క్ లైఫ్ సైన్సెస్ సీఈవో ఉదిత్ భాత్రా, నోవార్టిస్, డెలాయిట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు.ఈ కార్యక్రమంలో రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, నోవార్టిస్ కంట్రీ ప్రెసిడెంట్ జావెద్ జియా, హెడ్ ఆఫ్ టీఏ డయాబెటిస్ రీసెర్చ్ అండ్ జర్మన్ హబ్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఫిలిప్ లార్సెన్, యూఎస్ అండ్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ సెక్టార్ లీడర్, వైస్‌చైర్మన్ గ్రెగోరి రె పాల్గొన్నారు. ఎక్తా భట్రా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.