యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నాలుగు సంవత్సరాలు విరామం తరవాత నా స్వగృహంకు చేరాను. జగన్ ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరం. చంద్రబాబు పై పెట్టుకున్న ఆశలు నిలపెట్టుకోలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. శనివారం అయన జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో అవినీతి తాండవం చేస్తోంది. టిడిపి అధికారమే పరమావధిగా పాలించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా పప్పులు లాంటివి పంచుతున్నారు.. ఇలాంటివి ప్రజలు గమనిస్తున్నారు. నమ్మరు. చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయాలను గాలికి వదిలేసారు. టిడిపి ని తెలుగు కాంగ్రెస్ గా మార్చేశారని అయన విమర్శించారు. కాంగ్రెస్ కు తెలుగుదేశం అనుబంధం గా మార్చేశారు. టిడిపి ని ఎవరు పాలిస్తున్నారో మాకు అర్ధం కావడం లేదు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు పాలన పోవాలి జగన్ పాలన అవసరమని అయన అన్నారు. స్ధానిక పరిస్థితులు వల్ల పార్టీకి దూరంగా ఉండటం జరిగింది. హామీలు యేమి లేవి. జగన్ ఏవిధంగా మమ్మల్ని ఉపయోగించుకున్నా మా సేవలు అందిస్తామని దాడి అన్నారు.