యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంపై యథేచ్ఛగా కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశాన్ని నాశనం చేయాలని పెద్ద కుట్రకు తెరలేపారని చెప్పారు. ఇంత దారుణమైన కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవని విమర్శించారు. ‘బాహుబలి’ సినిమాలో చూపించిన దాని కంటే ఇది మహాకుట్ర అని అన్నారు. డేటా చోరీ వ్యవహారంపై అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ టీడీపీ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కావాలా? టీడీపీ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని భావోద్వేగం చెందారు. ఆంధ్రా ప్రజలను కేసీఆర్ ఎన్నో రకాలుగా అవమానించారని, ఏపీకి న్యాయంగా రావాల్సిన బకాయిలను తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆత్మగౌరవం అమ్ముకుని హైదరాబాద్ కు అమ్ముడుపోయారని మండిపడ్డారు.‘‘రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయి. చేసిన కుట్రలు బయటపడితే ప్రజలు ఛీ కొడతారని కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. తెదేపా డేటాను దొంగిలించి వైకాపాకు ఇవ్వాలని కుట్ర పన్నారు. తెదేపాను నాశనం చేయాలని చూస్తున్నారు. దుష్ట చతుష్టయం ఏమేం చేస్తున్నారో ప్రజలకు చాలా సార్లు చెప్పా. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన కుట్ర, కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఓ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అధికారులే దీనికి సూత్రధారులు అన్నారు. పీలో ప్రతిపక్షమే లేదని, అలాంటప్పుడు ఏపీకి వస్తాను తేల్చుకుంటానని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ కాదు కేసీఆర్ అని, ‘రండి, పోటీ చేయండి’ అంటూ కేసీఆర్ పై సెటైర్లు విసిరారు. దొంగతనం చేసేవాడు పక్కవాడిని కూడా ఇరికిస్తాడని, జగన్ చేసే పనుల వల్ల రేపు మన పిల్లలూ జైలుకు వెళ్లే పరిస్థితి రావచ్చని విమర్శించారు. ఈసారి ఏపీలో జరగబోయే ఎన్నికలు జీవన్మరణ సమస్యగా అభివర్ణించిన చంద్రబాబు, రాబోయే ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, అందుకని, ఇక్కడికి వేలకోట్లు పంపించి ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. ఏపీలో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల జాబితా కూడా హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు వైసీపీకి ఓటేస్తే కేసీఆర్ కు ఊడిగం చేయాల్సిందేనని అన్నారు.టీడీపీకి ఔట్ సోర్సింగ్ సేవలు అందించాడన్న కారణంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ కెరీర్ ను నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అతని కంపెనీపై దాడిచేసి మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. దేశప్రజలంతా ఈ విషయం గురించి ఆలోచించాలని సూచించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మా డేటాను దొంగిలించే అధికారం ఎవరు ఇచ్చారు? ఇది కుట్ర కాదా? మీ ఇష్టానుసారం వెళ్లడానికి ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా? లేక నియంత పాలన అనుకుంటున్నారా? ఇదంతా ఓవైపు జరుగుతుంటే జగన్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలుస్తారు. అందరూ కలిసి కుట్రను రక్తి కట్టిస్తున్నారు. గవర్నర్ ను కలిశాక బీజేపీ నేతలు సీబీఐ విచారణకు ఆదేశించాలని ఢిల్లీకి వెళ్లారు. సిగ్గులేకుండా తమ చర్యలను వీరంతా సమర్థించుకుంటున్నారు’ అంటూ మండిపడ్డారు. కోడికత్తి కేసు రాష్ట్ర పరిధిలోని అంశం అయినప్పటికీ బలవంతంగా కేంద్రం తీసుకుందని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. ఏపీకి ఇవ్వాల్సిన ఆస్తులను తెలంగాణ ఇంకా ఇవ్వలేదన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి చెందిన రూ.5 వేల కోట్ల కరెంటును వాడుకుని బకాయిలు ఇంకా చెల్లించలేదని విమర్శించారు.‘ఇప్పుడు కేసీఆర్ ఇక్కడకు రాలేడు. వేల కోట్లు పంపిస్తాడు. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు పంపాడని చెబుతున్నారు. నువ్వు(కేసీఆర్) సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెడుతున్నావ్ ఇక్కడ. ఎందుకంటే నీకు ఓ సామంత రాజ్యం కావాలి. నీ సామంత రాజ్యం కోసం ఓ పథకం ప్రకారం జగన్ ను పెట్టుకున్నావ్. ఈయన నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే అన్నమాట’ అని చంద్రబాబు తెలిపారు