YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ఏప్రిల్ 20న 'భరత్ అనే నేను' విడుదల 

Highlights

  •  ఉగాది రోజున స్పెషల్ టీజర్‌
ఏప్రిల్ 20న 'భరత్ అనే నేను' విడుదల 

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'భరత్ అనే నేను'లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఇక పొలిటికల్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కైరా అద్వాణీ నటిస్తుండగా.. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా  షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందిస్తున్నారు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించాలనుకుంటుంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఉగాది రోజున స్పెషల్ టీజర్‌ను విడుదల చేసేపనిలో  టీం తలమునకలవుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మహేశ్ అభిమానులకు పెద్ద పండగే మరి.

Related Posts