YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఈసీ.. ఏప్రిల్‌ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..!!

ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఈసీ.. ఏప్రిల్‌ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..!!

 యువ్  న్యూస్ జనరల్ బ్యూరో: 

 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 3న ప్రస్తుత లోక్ సభ ముగియన్న తరుణంలో, మే నెలలో ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ను ప్రకటించింది. ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ను విడుదల చేశారు. 
 9 దశల్లో కాకుండా 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. 
తొలి దశ: పోలింగ్ ఏప్రిల్ 11న. 
రెండో దశ: ఏప్రిల్ 18న పోలింగ్. 
మూడో దశ: పోలింగ్ తేదీ ఏప్రిల్ 23. 
నాలుగో దశ: పోలింగ్ తేదీ ఏప్రిల్ 29.  
ఐదో దశ:  పోలింగ్ తేదీ మే 6
ఆరో దశ:  పోలింగ్ తేదీ మే 12.
ఏడో దశ:  పోలింగ్ తేదీ మే 19

           మరోవైపు  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11న తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు, తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్‌ 11నే ఎన్నికలు జరగనున్నాయి. 2014లో తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగ్గా, (వేర్వేరు తేదీల్లో) ఈసారి తెలంగాణలో తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. శాసనసభా ఎన్నికల్లో తెరాస విజయ ఢంకా మోగించింది. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..!
* ఎన్నికల నోటిఫికేషన్‌: మార్చి 18న
* నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 25
* నామినేషన్ల పరిశీలన: మార్చి 26
* నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28
* పోలింగ్‌: ఏప్రిల్‌ 11న
* ఓట్ల లెక్కింపు: మే 23న

Related Posts