YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

అబుదాబికి సాహో టీమ్..

Highlights

  • లండన్ బ్యూటీ అమీ జాక్సన్ అప్పియరెన్స్..?
అబుదాబికి సాహో టీమ్..

ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సాహో చిత్ర యూనిట్ అబుదాబి కి వెళ్లనున్నది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇప్పటికే హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంది.  ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ లో భాగంగా అబుదాబిలో  భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంది.

అదేంటంటే ఈ మూవీలో లండన్ బ్యూటీ అమీ జాక్సన్ కెమెరా అప్పియరెన్స్ ఇవ్వనుందట. త్వరలో ఈ చిత్ర షూటింగ్‌లో ఆమె పాల్గొనున్నట్టు తెలుస్తోంది. అయితే సెట్స్ మీదకు వెళ్లకముందు ఈ సినిమా కోసం వినిపించిన హీరోయిన్లలో అమీ జాక్సన్ కూడా ఒకరు. ఈ మూవీ కోసం ఆమె అప్పట్లో ఒప్పుకున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే తరువాత హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్‌ను ఫిక్స్ చేసినట్టు సినీలోకం కోడైకూస్తోంది. ఇందులో నియోజమేంటో చూడాలి.

Related Posts