YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒడిశాలో మూడో స్థానానికి కాంగ్రెస్

ఒడిశాలో  మూడో స్థానానికి కాంగ్రెస్

యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పూర్వవైభవం వస్తుందా? కనీసం పోటీలోనైనా ఉంటుందా? ఒంటరిపోరుతో ఎన్నికలకు వెళుతున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారయింది. ఒడిశాలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సరైన నాయకత్వం లేకపోవడం, క్యాడర్ చెల్లా చెదురు కావడంతో ఒడిశాలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కు ఎప్పుడో వెళ్లిపోయింది. కాంగ్రెస్ స్థానాన్ని కమలం పార్టీ ఆక్రమించుకుంది.ఒడిశాలో పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.21 లోక్ సభ స్థానాలు 147 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతోంది. అయితే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ స్థానాలకు సంబంధించి దరఖాస్తులు అతి తక్కువగా రావడం గమనార్హం. కేవలం రెండు వేల దరఖాస్తులు మాత్రమే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి అందాయి. దరఖాస్తుదారుల్లో ఎక్కువగా ద్వితీయ శ్రేణినేతలే ఉండటం కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. పీీసీపీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ సయితం ఈ దరఖాస్తులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.నిజానికి ఇక్కడ అధికార బిజూజనతాదళ్ ఎన్నికల వేళ ముందంజలో ఉంది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాలియా, శక్తి మిషన్ వంటి పథకాలను తమను గట్టున పడేస్తాయని బిజూ జనతాదళ్ భావిస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన నవీన్ పట్నాయక్ ఒకరకంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. 21 పార్లమెంటు స్థానాలను దక్కించుకునే లక్ష్యంతో పనిచేస్తున్నారు.మరోవైపు బీజేపీ కూడా పట్టు బిగిస్తుంది. మోదీ, అమిత్ షాల వరుస పర్యటనలతో హోరెిత్తిస్తోంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పట్టుబిగించిన భారతీయ జనతా పార్టీ ఈసారి లోక్ సభ స్థానాల్లో డబుల్ డిజి

Related Posts