YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మీకు తెలుసా వీళ్ళు త్వరగా మూడ్ అవుతారంట..

Highlights

  • ఈ రాశుల వారు డిప్రెషన్ లోకి ఈజీగా వెళ్లిపోతారు 
  • మకరరాశి
  • వృషభం, 
  • వృశ్చికం, 
  • కర్కాటకం ,
  • మీనం

 

మీకు తెలుసా వీళ్ళు త్వరగా మూడ్ అవుతారంట..

 జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి నిరుత్సాహానికి గురవుతుంటారు. డిప్రెషన్ కు కూడా లోనవుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో కారణం వల్ల డిప్రెషన్ కు గురవుతుంటారు. అయితే రాశుల ప్రకారం కూడా కొందరు డిప్రెషన్ కు గురవుతారు. ఏయే రాశుల వారు డిప్రెషన్ కు గురవుతారో ఒక్కసారి చూద్దాం..

మకరరాశి - డిసెంబర్ 23- జనవరి 20 మకరరాశి వారికి తాము ఇతరుల కన్నా ముందంజలో ఉండాలని ఉంటుంది. అయితే ఒక్కోసారి మకరరాశి వారు ఎంత కష్టపడి పని చేసినా కూడా విఫలం అవుతూ ఉంటారు. అంతేకాకుండా వీరు వారి సామర్థ్యానికి మించి చేస్తూ ఉంటారు. అయినా కూడా ఒక్కోసారి వారు అనుకున్న లక్ష్యాలను సాధించలేరు. దీంతో మకరరాశి వారు డిప్రెషన్ లోకి వెళ్తుంటారు.

వృషభం : ఏప్రిల్ 20-మే 20 వృషభరాశి వారు వాస్తవాన్ని గ్రహించి బతకాలి. కలల్లో తేలిపోతే జీవితంలో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. వీరు ఎక్కువగా ఊహల్లో తేలిపోతుంటారు. వాస్తవంలో అలా జరగకపోయేసరికి ఇబ్బందులకు గురవుతారు. వృషభరాశి వారు ఈజీగా డిప్రెషన్ లోకి వెళ్తారు.

వృశ్చికం : అక్టోబర్ 24 నవంబర్ 22 వృశ్చికరాశి వారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఫీలవుతుంటారు. వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే తమలో తాము బాధపడుతుంటారు. అలాంటి బాధలోకి వెళ్లే వీరు ఎక్కువగా డిప్రెషన్ కు గురవుతుంటారు.

కర్కాటకం : జూన్ 21- జూలై 22 వీరు ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తారు. కర్కాటక రాశి వారికి కాస్త పిరికితనం ఉంటుంది. అలాగే తమ గురించి ఇతరులు ఏమనుకుంటారో అని ఎక్కువగా తమలో తాము అనుకుంటూ ఉంటారు. వీరికి భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువ.

మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20 మీనరాశి వారు చాలా త్వరగా బాధకు లోనవుతుంటారు. అయితే వారి బాధకు కారణం ఏమిటనే విషయం కూడా వారికి అర్థం కాదు. అయితే మీన రాశి వారు చాలా సున్నిత మనస్కులు. దీంతో వీరు త్వరగా డ్రిపెషన్ కు గురవుతుంటారు.

Related Posts