YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం

 ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:       
 

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా 2019గాను మొత్తం 112 మందిలో సోమవారం 56 మందికి పురస్కారాలు అందించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రప్రతి వెంకయ్య, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌‌తో పాటూ పలువురు  ప్రముఖులు హాజరయ్యారు. మిగిలినవారికి ఈ నెల 15న జరిగే తదుపరి కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తారు.  రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ప్రముఖులు.. ప్రముఖ జర్నలిస్ట్ కుల్‌దీప్‌ నయ్యర్‌(మరణానంతరం) - పద్మభూషణ్‌( అవార్డును ఆయన సతీమణి భారతి నయ్యర్‌ అందుకున్నారు) నటుడు మోహన్‌లాల్‌- పద్మభూషణ్‌ సర్దార్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిల్సా - పద్మభూషణ్‌ హకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ - పద్మభూషణ్‌ నటుడు ప్రభుదేవా – పద్మశ్రీ సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ – పద్మశ్రీ కబడ్డీ ఆటగాడు అజయ్‌ ఠాకూర్‌ – పద్మశ్రీ రెజ్లర్‌ భజరంగ్‌ పునియా – పద్మశ్రీ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక – పద్మశ్రీ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు శరత్‌ కమల్ – పద్మశ్రీ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుబ్రమణ్యం జయశంకర్‌ - పద్మశ్రీ వీరితో పాటూ మరికొందరు పద్మ పురస్కారాలను అందుకున్నారు.
 

Related Posts