యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ నెల 16వ తేదీన తిరుపతి నుండి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర నుండి చంద్రబాబునాయుడు రోడ్ షోలను ప్రారంభించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.వచ్చే నెల 11వ తేదీన ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబునాయుడు దాదాపుగా పూర్తి చేశారు. ఈ నెల 16వ తేదీ నుండి చంద్రబాబునాయుడు తిరుపతి నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుడతారు. తిరుపతిలో సభ నిర్వహించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాబు ఎన్నికల క్యాంపెయిన్‌కు వెళ్లనున్నారు.ఈ నెల 16వ తేదీ లేదా మరునాడు శ్రీకాకుళం జిల్లా నేతలతో బాబు సమావేశం కానున్నారు. మరోవైపు అదే జిల్లాలో రోడ్‌షోలు నిర్వహించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజుకో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ చోట్ల రోడ్ షోలు నిర్వహించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అభ్యర్ధులను ఫైనల్ చేయని జిల్లాల్లో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన చంద్రబాబునాయుడు అభ్యర్ధుల జాబితాను ప్రక టించే అవకాశం ఉంది.