యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ 9 ఏళ్లు ఎన్నో కష్టాలను అనుభవించామని, టీడీపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు.. నాలుగేళ్లు బీజేపీతో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను గండికొట్టారు.ప్రత్యేక హోదాను టీడీపీ తాకట్టు పెట్టింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. చివరికి దేవుడి భూములను కూడా టీడీపీ నేతలు వదిలి పెట్టలేదు. రాజధానిలో టెంపరరీ బిల్డింగ్‌లు తప్పా.. పర్మినెంట్ ఏదీ కన్పించదు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేశారు. మోసాలు చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు. చంద్రబాబు ఆయన బినామీలకే రాయితీలుటెండర్లు ఇస్తున్నారు. ఎన్నికల వేళ సినిమాల పేరుతో చంద్రబాబు చేస్తున్న డ్రామాలపై చర్చ జరగాలని జగన్ కోరారు.కాకినాడలో వైఎస్‌ఆర్‌సీపీ సమరశంఖారావం సభలో జగన్ ప్రసంగించారు. అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందించడమే నా లక్ష్యం. సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికి అందాలి. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటా. వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వ మోసాలపై ప్రతీ ఇంట్లో చర్చ జరగాలి. చంద్రబాబు పార్టీ మాదిరి వైసీపీ ఉండదు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన డేటా చోరీ కేసులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఒక సైబర్ క్రిమినల్ అని వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటాను చోరీ చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల డేటాను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు అని వైఎస్ జగన్ నిలదీశారు. ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఓట్ల తొలగింపులోనూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. దొంగ ఓట్లను చేర్పిస్తూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రతి గ్రామంలోనూ వివరించాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు