YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఫస్ట్ రెబల్ అభ్యర్ధిగా ముళ్లపూడి

టీడీపీ  ఫస్ట్ రెబల్ అభ్యర్ధిగా  ముళ్లపూడి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఎక్క‌డిక‌క్కడ నాయ‌కుల‌కు టికెట్లు క‌న్ఫ‌ర్మ్ అవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. అయితే, ఎన్నిక‌ల‌న్నాక ఆశించిన విధంగా టికెట్లు ల‌భించే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంది. టికెట్లు త‌క్కువ.. అభ్య‌ర్థులు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ టికెట్‌కు ఇద్ద‌రు చొప్పున పోటీ ప‌డుతున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆచితూచి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్నారు. అయితే, గ‌డిచిన అయిదారేళ్లుగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ స‌త్తా చాటుతున్న నాయ‌కులకు కూడా ఈ ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భించ ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఆయా నాయ‌కులకు వేరే ప‌ద‌వులు ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇస్తున్నారు. మ‌ళ్లీ అవ‌కాశం అంటే.. చాలా టైం ప‌డుతుంద‌ని భావిస్తున్న నాయ‌కులు ఇప్ప‌టికిప్పుడే త‌మ‌కు న్యాయం జ‌ర‌గా ల‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నాయ‌కులు రెబ‌ల్‌గా మారుతున్నారు. స్వ‌తంత్రంగా త‌మ స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారిలో ప్ర‌ధ‌మంగా మ‌న‌కు క‌నిపిస్తున్నారు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జెడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు. ఈయ‌న గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే తాడేప‌ల్లి గూడెం టికెట్‌ను ఆశించారు. అయితే, అప్ప‌టి మిత్ర‌ప‌క్షం బీజేపీకి ఈటికెట్‌ను ఇవ్వ‌డంతో ఆయ‌న మౌనం వ‌హించారు. అయినా.,. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేస్తూ వ‌చ్చారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో త‌న స‌త్తాచాటాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. అనుకున్న‌ది ఒక్క‌టి జ‌రిగింది మరొక్క‌టి.. అన్న విధంగా ప‌రిస్థితి ఉండ‌డంతో ఇక్క‌డ నుంచి ఈలి నానికి చం ద్రబాబు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేశారు. వాస్త‌వానికి బాపిరాజు కొన్నేళ్లుగా ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున‌, ప్ర‌భుత్వం త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తు న్నారు. అయితే, బాపిరాజును బుజ్జ‌గించి నానికి టికెట్ క‌న్ప‌ర్మ్ చేయ‌డంతో ఆయ‌న అనుచ‌రులు స‌హా ప్ర‌తి ఒక్క‌రూ విస్మ‌యానికి గుర‌య్యారు.ఈ క్ర‌మంలోనే స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని బాపిరాజు నిర్ణ‌యించుకున్నారు. అయితే, పార్టీ ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను హ‌ర్షించ‌దు కాబ‌ట్టి ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డే అవ‌కాశం ఉంది. దీనిని గుర్తించిన బాపిరాజు మ‌రి ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాలి. గెలిస్తే.. ఓకే.. ఒక‌వేళ ఏదైనా ప‌రిస్థితి ఎదురుతిరిగితే ఓట‌మి పాలైతే.,. రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్న ప‌రిణామం. మ‌రి ఏంజ‌రుగుతుందోచూడాలి.

Related Posts