యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రానున్న సార్వత్రిక ఎన్నికలలో మహిళల తీర్పే కీలకంగా మారనుంది. పురుషాధిక్య సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరి తీర్పు అత్యంత కీలకంగా మారనుంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే గణనీయంగా ఉంది. పురుష ఓటర్లతో పోలిస్తే జిల్లాలో 46వేలు పై చిలుకు మహిళా ఓటర్లే కావడం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా తుది నివేదిక ప్రకారం జిల్లాలో మొత్తం 34లక్షల 12వేల 581 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో అత్యధికంగా మహిళా ఓటర్లే. 16లక్షల 83వేల 83 మంది పురుషులు ఓటర్లు ఉండగా 17లక్షల 29వేల 186 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారు. పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య 46వేల 103 మంది అత్యధికంగా ఉన్నారు. వీరు గాక జిల్లాలో మరో 312 మంది థర్డ్ జనరల్ (హిజ్రాలు) ఓటర్లుగా నమోదయ్యారు. తిరువూరు, నూజివీడు నియోజకవర్గాలు మినహా మిగిలిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే పై చెయ్యిలో ఉన్నారు. జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా మైలవరం నియోజకవర్గంలో 2లక్షల 68వేల 463 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా పెడన నియోజకవర్గంలో లక్షా 64వేల 171 మంది ఉన్నారు.
తిరువూరు(ఎస్సీ) 2,00,517
నూజివీడు 2,25,431
గన్నవరం 2,50,504
గుడివాడ 1,99,423
కైకలూరు 1,91,912
పెడన 1,64,171
మచిలీపట్నం 1,75,698
అవనిగడ్డ 2,03,453
పామర్రు(ఎస్సీ) 1,78,026
పెనమలూరు 2,58,586
విజయవాడ వెస్ట్ 2,11,922
విజయవాడ సెంట్రల్ 2,45,572
విజయవాడ ఈస్ట్ 2,52,980
మైలవరం 2,68,463
నందిగామ(ఎస్సీ) 1,93,712
జగ్గయ్యపేట 1,92,211