YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా..

Highlights

  • జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మంత్రి...
నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా..

నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి పరుష పదజాలంతో ఘాటుగా విమర్శించారు. నీ కుటుంబ చరిత్ర ఏంటో.. నా కుటుంబ చరిత్ర ఏంటో తేల్చుకుందాం అంటూ  దుయ్య పడుతూ జగన్ కు  బహిరంగ సవాల్ విసిరారు. మీ తాత రాజారెడ్డి చరిత్ర గుట్టు విప్పుతానంటూ అయన జగన్ పైన  తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. బైరటీస్ గనులకోసం నర్సయ్యను రాజారెడ్డి హత్య చేయించారని సంచలన విషయం బయటపెట్టారు... నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు నుంచి, నువ్వు చేసిన అరాచకాలు తెలుసని, తేల్చుకుందాం రా అని సవాలు విసిరారు.జగన్ దగుల్బాజీ పనుల వల్ల నరేంద్ర మోడీకి నోటీసులు వచ్చాయని తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి  దుయ్యబట్టారు. 13 కేసులు ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను, భారతీయ జనతా పార్టీ కాని, మోడీ కాని దగ్గరకు రానివ్వదని అన్నారు.జగన్‌వి ఊరపంది ఆలోచనలు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల పై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయన ఆక్షేపించారు.  13 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డిలు అధికారులపై విమర్శలు చేయడమా అని మంత్రి ఆదినారాయణ రెడ్డి  ప్రశ్నించారు.

Related Posts