YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రకు కమిటీలు

Highlights

  • టీపీసీసీ చీఫ్ వెల్లడి
  • భట్టి  విక్రమార్కతో సలహా సంఘం
  •  నారాయణరెడ్డితో ఆర్థిక సంఘం
  • షబ్బీర్ అలీతో ఆర్గనైజింగ్ కమిటీ
  • ఫిబ్రవరి 26 న  చేవెళ్ల నుంచి యాత్ర ప్రారంభం 
  • టీపీసీసీ చీఫ్ వెల్లడి
కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రకు కమిటీలు

 రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టనున్న ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేసే క్రమంలో టీపీసీసీ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందుకు గానూ ఏర్పాటు చేసిన  సలహా సంఘాన్ని, ఆర్థిక సంఘాన్ని, ఆర్గనైజింగ్ కమిటీలను  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కార్యనిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క చైర్మన్‌గా, 18మంది ప్రముఖ నాయకులతో సలహా సంఘం ఉండబోతోంది. అలాగే టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి చైర్మన్‌గా కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర ఆర్థిక సంఘాన్ని ఉత్తమ్  ప్రకటించారు. ఇక షబ్బీర్ అలీ చైర్మన్‌గా 31మందితో ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఫిబ్రవరి 26వ తేది చేవెళ్ల నుంచి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం కానున్న విషయం విదితమే.

Related Posts