YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీ వలలో ఆర్ఐ

ఏసీబీ వలలో ఆర్ఐ
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పు గోదావరి జిల్లా  రంపచోడవరం మండలం రెవెన్యూ కార్యాలయంలో లో ఎ. ఆర్ఐ గా పనిచేస్తున్న జెర్రిపోతుల విల్లింగ్టన్ బాబు చంద్రన్న బీమా లబ్ధిదారుల నుండి రూ 5,000 లంచం తీసుకుంటూ తన సొంత ఇంట్లో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఎసిబి డీఎస్పీ సుధాకర్, ఫిర్యాదు దారుడు వంటికుల ఆదిరెడ్డి, బాధితుడు కొనుతూరి సత్తిబాబు  తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలం క్రితం రంపచోడవరం మండలం చిలక మామిడి గ్రామంలో  కొనుతూరి రాంబాబు  ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుని కుటుంబానికి చంద్రన్న బీమా రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. బీమా అధికారులు నగదు ఇవ్వడానికి లీగల్ హైర్ సర్టిఫికెట్ కావాలని తెలిపారు. రంపచోడవరం తహశీల్దార్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రం కోసం సత్తిబాబు దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ  వీఆర్వో దరఖాస్తులపై విచారణ జరిపి రంపచోడవరం ఆర్ఐ విల్లింగ్టన్ కు ధ్రువపత్రం మంజూరుకు సిఫార్సు చేశారు. ధ్రువపత్రం మంజూరు చేయాలంటే తనకు 10,000 రూపాయలు ఇవ్వాలని ఆర్ఐ విల్లింగ్టన్ బాబు దరఖాస్తు దారుని డిమాండ్ చేశాడు. దీనితో దరఖాస్తుదారుడు సత్తిబాబు గ్రామంలోని ఆదిరెడ్డి తో కలిసి ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రూ 5,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో తమ ఇంటికి వచ్చి ఇవ్వవలసిందిగా ఆర్ఐ సూచించాడు. అదే విధంగా ఇంటికి వెళ్లి సొమ్ములు ఇస్తుండగా లంచం తీసుకుంటున్న వెల్లింగ్టన్ బాబు ను ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడులలో ఎసిబి సిఐలు పుల్లారావు, మోహనరావు, తిలక్, ఎస్సై నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts