Highlights
- జాతీయ మహిళా కమిషన్ ఆశ్రయించిన బాధితురాలు
- బురద జల్లే ప్రయత్నం..
- పరువు నష్టం దావా వేశా.. సీఎం ఖండూ
దేశంలో ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యాచార అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో తాజాగా చర్చనీయాంశమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ తనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారంటూ చేశారంటూ ఆరోపణలు చేసింది ఓ మహిళ.పదేళ్ల క్రితం జూలైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ సమయంలో తాను స్పృహలో లేనని తెలిపింది. ఇటీవల ఓ న్యాయవాది సాయంతో ఆమె జాతీయ మహిళా కమిషన్ ఆశ్రయించారు. కానీ, ఎన్‌డబ్ల్యూసీ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
దీంతో దీనికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తాజాగా పేర్కొంది. అయితే ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత 2015లో (సరిగ్గా ఖండూ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొద్ది నెలల ముందు) ఆమె ఈ విషయమై ఇటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో అదంతా నిజం లేదని తేల్చేశారని ఆమె గుర్తు చేశారు.
అనవసరమైన ఆరోపణలతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఖండూ పేర్కొన్నారు.దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఈ ఆరోపణలను ఖండూ తీవ్రంగా ఖండించారు ఈ వ్యవహారంపై పరువు నష్టం దావా వేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని బీజేపీ మండిపడింది. ఆ ఫిర్యాదు వెనుక దురుద్దేశం, ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.