యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
యువ సంగీత దర్శకులకు వరంగా మారారు యువ గాయకుడు సిద్ శ్రీరామ్. ఆయన గొంతులోని ఆత్రం ప్రేమ భావాలను తేనెలొలికించినట్టు ఉండటంతో యూత్ అంతా ఆయన హస్కీ వాయిస్‌కి ఫిదా అవుతున్నారు. యంగ్ జనరేషన్‌ని ఆకట్టుకునే విధంగా ఈమధ్య వచ్చే లవ్ సాంగ్స్ అన్నీ సిద్ శ్రీరామ్ గాత్రంతోనే వస్తున్నాయి. ఆయన పాటే సినిమాకి ప్రాణంగా మారింది. ‘ఐ’ సినిమాలో ‘నువ్వుంటే నా జతగా’ పాట మొదలు వరుసగా.. 24 చిత్రంలోని ‘మనసుకే’, నిన్నుకోరి చిత్రంలోని ‘అడిగా... అడిగా’, గీత గోవిందంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’, టాక్సీవాలాలోని ‘మాటే వినదుగా’, పడి పడి లేచె మనసు చిత్రంలో ‘ఏమైపోయావే’, ‘హుషారు’ చిత్రంలోని ‘ఉండిపోరాదే’ వరకూ ప్రతి పాటా ఓ సంచలనంగా మారింది. తాజాగా ఆయన పాడిన హుషారు చిత్రంలోని ‘ఉండిపోరాదే’ సాంగ్ యూట్యూబ్‌లో 30 మిలియన్ వ్యూస్‌కి చేరువై సంగీత ప్రపంచంలో సంచలనంగా మారింది. ఆ సాంగ్ లిరిక్స్ మీకోసం.. హాయిగా పాడుకోండి.