యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉపయోగించిన ప్రచార రథాలు నెల్లూరు జిల్లాలో కనిపించందం హాట్ హాట్ టాపిక్ మారింది.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులంతా కోట్లు ఖర్చు పెట్టుకొని గెలిచారు. వారి ప్రచార వాహనాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఒక్కోటి దాదాపు 30 లక్షలు విలువ చేసే ఈ రథాలను ఇప్పుడు ఏపీకి పంపిస్తున్నారు. తమకు తెలిసిన.. అనుకూలురైన ఎమ్మెల్యే అభ్యర్థులకు వాడుకోమ్మని ఇచ్చేస్తున్నారు. సదురు ఏపీ నేతలు రంగు మార్చి వాడుకుంటున్న వైనం ఆసక్తి రేపుతోంది. వాటికి మరో వైసీపీ రంగువేసి ఉంచారు. అయితే లోపల సీట్లపై కారు గుర్తు ఉండడంతో ఇవే టీఆర్ ఎస్ ప్రచార రథాలు అని అర్థమవుతోంది.ప్రస్తుతం స్నేహగీతం ఆలపిస్తున్న టీఆర్ ఎస్-వైసీపీలు ఇలా ప్రచార పర్వంలోనూ సహకరించుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆందోళనగా ఉన్నారు. టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అనడంతో ఇలా అన్నింట్లోనూ వేలు పెట్టి వైసీపీకి మేలు చేస్తున్నారని భయపడిపోతున్నారు.అధికారంలో టీడీపీ ఉండడంతో వారికి ఆర్థిక లోటు లేదు. ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష వైసీపీ నేతలు మాత్రం టీడీపీతో పోల్చితే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. అందుకే టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వాడిన ప్రచార రథాలను అద్దెకు తెచ్చుకొని వాటిని వైసీపీ రంగు - ఫ్యాన్ గుర్తుకు మార్చి వాడుకుంటున్నారు. ఇలా ప్రచారపర్వంలో ఖర్చులు తగ్గించుకోవడానికి వైసీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నట్టు అర్థమవుతోంది.