యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ బుధవారం చెన్నైలో విద్యార్థుల సభలో మాట్లాడినప్పుడు పేర్ల విషయంలో కొంచెం తడబడ్డారు. కానీ అంతలోనే సర్దుకున్నారు. బ్యాంకులకు 13 వేల కోట్లు టోకరావేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పేరుకు బదులు నరేంద్రమోదీ అనేశారు. వెంటనే పొరపాటు దిద్దుకున్నారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆయన కావాలనే అలా అనారో లేక నోరు జారారో కానీ విద్యార్థులు మాత్రం నవ్వుల్లో మునిగిపోయారు. బ్యాంకుల నుంచి వేలకోట్లు తీసుకుని నీరవ్ మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని రాహుల్ నిలదీశారు. మీలాంటి యువతకు ఓ 30 లక్షలు ప్రభుత్వం అప్పుగా ఇచ్చినా మీరు మీకాళ్ల మీద నిలబడడమే కాకుండా ఎందరికో ఉపాధి చూపించగలరు అని పేర్కొన్నారు. చోటా మోదీని బడా మోదీ కాపాడుతున్నారని కాంగ్రెస్ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతిపరులైన వ్యాపారుల పాలవుతున్న సొమ్ము మీలాంటి యువతకు మళ్లించడమే మా లక్ష్యం అని రాహుల్ విద్యార్థులతో అన్నారు.