యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షలాది ఓట్లను తీసేయడం దేశ చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదు. ఇంత దివాళాకోరు రాజకీయం ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. వీరు బ్లూ ప్రింట్ ఇస్తే తెలంగాణా పోలీసులు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వ్యాపారాలు అడ్డదారి-రాజకీయం అడ్డదారి-అతని జీవితమే అడ్డదారి-అతని పార్టీది చెడ్డదారని అన్నారు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది’’ అన్నట్లు... అతను చెడిందే కాక తన తోటివాళ్లను కూడా చెడగొట్టాలని చూడటం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. దొంగ వ్యాపారాలు, బోగస్ షేర్లు, షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన, అతని నేరాలకు అంతే లేదు వ్యాపారంలో అని విమర్శించారు. ఇప్పుడు రాజకీయంలోనూ నేరాలనే చొప్పించే కుట్రలు చూశాం. లక్షలాది ఓట్ల తొలగింపు ఆలోచనలు ఎవరికైనా వస్తాయా..? 9లక్షల ఫామ్ 7 దరఖాస్తులు పంపడం దేశ చరిత్రలో చూశామా..? ప్రత్యర్ధి పార్టీ డేటా ఎత్తుకుపోదాం అనే ఆలోచన ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారం పాయింట్ల వారీగా రాసుకుని మరీ టీడీపీపై కుట్ర చేశారన్నారు. ఈసీకి విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖలో వివరాలన్నీ ఉన్నాయని తెలిపారు. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఈ డ్రామా నడిపారని తెలిపారు. ఇంతకు ముందు కూడా పంటలు తగలబెట్టడం లాంటి అరాచకాలు చాలా చేశారని గుర్తుచేశారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో జగన్ కు బాగా తెలుసునని చంద్రబాబు అన్నారు. నేరాలకు గ్రాండ్ మాస్టర్ వైకాపా అధినేత అని విమర్శించారు. నేరాల నుంచి తప్పించుకోవడానికి జగన్ కు కేసీఆర్, మోడీ అండగా దొరికారని చంద్రబాబు అన్నారు.