యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. కోహ్లీసేనకు 273 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (100; 106 బంతుల్లో 10×4, 2×6) రెండో శతకంతో ఆకట్టుకున్నాడు. పీటర్ హాండ్స్‌కాంబ్ (52; 60 బంతుల్లో 4×4) అర్ధశతకం సాధించాడు. మధ్య ఓవర్లలో చక్కని బౌలింగ్‌లో ఆకట్టుకున్న భారత బౌలర్లు చివర్లో గాడితప్పారు. వెంటవెంటనే కీలక వికెట్లు నష్టపోయిన కంగారూలు 250 చేయడం కష్టమే అనుకున్న తరుణంలో పట్టు విడిచారు. అదనపు పరుగులు ఇవ్వడంతో స్కోరు 272/9కు చేరింది. భువనేశ్వర్ 3 వికెట్లు తీశాడు. షమి, జడేజా చెరో 2 వికెట్లు తీశారు.