యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
రాంగోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు కష్టాలు తప్పేలా లేవు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా రిలీజ్ ను ఆపాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఫిర్యాదు చేసారు. ఈ మూవీలో తన అధినేతను చంద్రబాబును నెగిటివ్ రోల్లో చూపించారని… దీని ప్రభావం రానున్న అసెంబ్లీ, లోక్సభకు ఎన్నికలపై పడుతుందని ప్రస్తావించాడు. ఎలక్షన్స్ అయ్యే వరకు సినిమా ఆపాలని ఆయన అన్నారు. ఈ సినిమాను నిర్మించిన రాకేష్ రెడ్డి వైసీపీకి చెందిన వ్యక్తి అని.. ఇందులో రాజకీయ దురుద్దేశాలు కూడా ఉన్నాయని ఆరోపించాడు దేవీబాబు.అందుకే ఈసీ ఫిర్యాదు చేశామని, ఒకవేళ ఈసీ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపాడు. మార్చి 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఈసీ ఆపినా ఆపవచ్చని అంటున్నారు. మరోవైపు ఒకవేళ ఈ సినిమా ఆపితే ఫైట్ చేస్తానని అంటున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. అసలు చంద్రబాబును నేను నెగటివ్ చూపించలేదని.. జరిగిన వాస్తవం ఏంటో చూపించానని వర్మ చెప్పాడు. మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి