Highlights
- రాజకీయ నేతలు, జిల్లా అధికారులు, ప్రముఖులు హాజరు
- అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ ఆమ్రపాలి దంపతులు
దంపతులైన ఐ ఏఎస్, ఐపీఎస్ ల పెళ్లి రిసెప్షన్ అంగరంగ వైభోపేతంగా జరిగింది. ఇటీవల వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి-ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
శనివారం సాయంత్రం నూతన వధూవరులు వరంగల్ జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాయంలో పెళ్లి రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ నేతలు, జిల్లా అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.
వేదికపై నూతన దంపతులు దండలు మార్చుకోగా... అతిథులు శుభాకాంక్షలు తెలిపి... ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. తొలుత కలెక్టర్ ఆమ్రపాలి దంపతులు వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.