Highlights
- ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
- రాజకీయాల్లోకి వస్తా
- సబ్బవరంర వచ్చిన రమ్యశ్రీ
రాజకీయం పుట్టుకతో రాదని, అనుభవం ద్వారా అది వస్తుందని ప్రముఖ సినీ నటి రమ్యశ్రీ అభిప్రాయపడ్డారు. శుక్రవారం విశాఖపట్నం సబ్బవరంర వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..తనకు సాధ్యమైనంతవరకు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. ఈ క్రమంలో రమ్య హృదాలయ ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవలు చేస్తున్నట్టు చెప్పారు. విశాఖపట్నంలో నాలుగేళ్లుగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు ఆదరిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని రమ్యశ్రీ చెప్పారు. తానిప్పటివరకు 300 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు.
కన్నడంలో నటించిన ఆర్యభట్ట సినిమాకు జాతీయ అవార్డు పొందడమే కాకుండా తెలుగు చిత్రం ఓమల్లి తనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిందని చెప్పారు. నటనలోనే కాకుండా స్క్రీన్‌ప్లే, దర్శకత్వ రంగాల్లో కూడా తనకు అనుభవం ఉందని రమ్యశ్రీ చెప్పారు. నటనకు, దర్శకత్వానికి రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ జ్యూరీ నంది అవార్డు లభించింది చెప్పారు
1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. కన్నడంలో నటించిన ఆర్యభట్ట సినిమాకు జాతీయ అవార్డు పొందారు. తెలుగు చిత్రం ఓమల్లి తనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిందని రమ్యశ్రీ చెప్పారు.