YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోహ్లీపై సునీల్ మండిపాటు

కోహ్లీపై సునీల్ మండిపాటు
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ను చేజార్చుకున్న భారత్ జట్టుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి ముగిసిన సిరీస్ విజేత నిర్ణయత్మక ఆఖరి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో తడబడిన టీమిండియా 35 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్ను 3-2తో కంగారులు చేజిక్కించుకోగా.. సిరీస్ గెలవకముందే కోహ్లీసేన ప్రయోగాల వెంట పరుగెత్తడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. తొలి రెండు వన్డేల్లో విజయాన్ని అందుకున్న భారత్ జట్టు మూడో వన్డేలోనూ గెలిచి ఉంటే..? అప్పుడు ప్రయోగాలు చేసుంటే బాగుండేదని గుర్తుచేసిన గవాస్కర్.. ఆసీస్ను తక్కువ అంచనా వేయడం, అనాలోచిత నిర్ణయాల కారణంగా సిరీస్ చేజారిందని అభిప్రాయపడ్డాడు. మూడో వన్డేలో అనూహ్య విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగా.. ఈ దశలో కీలకమైన నాలుగో వన్డేలో మహేంద్రసింగ్ ధోనికి రెస్ట్ ఇచ్చి, సీనియర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడిపై వేటు వేశారు. దీంతో.. కీపర్గా వచ్చిన రిషబ్ పంత్ వరుస తప్పిదాలు చేయగా.. కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. నిన్న ఆఖరి వన్డేలోనూ అదనపు బ్యాట్స్మెన్గా ఉన్న కేఎల్ రాహుల్ని తప్పించి మరీ ఒక బౌలర్ని తీసుకోవడం ఛేదనలో భారత్కి ఇబ్బందిగా మారింది. ప్రపంచకప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్ని పరీక్షించుకోవడం ముఖ్యమే.. కానీ.. సిరీస్లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ముగియగానే రెండు వారాల వ్యవధిలో వరల్డ్కప్ ప్రారంభమవుతుంది. 

Related Posts